Sharmila:మణిపూర్‌ అల్లర్లు బాధించాయి

43
- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. ఢిల్లీలో పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల..ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత నన్ను తీవ్రంగా బాధించిందన్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని…ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని…అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుందన్నారు.

సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి మణిపూర్ ఘటనే ఓ నిదర్శనం అన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని నాతో పాటు ప్రజలందరిలో పెంచిందని..
కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదన్నారు.

Also Read:కేసీఆర్‌ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్

- Advertisement -