ఆ నటుడు ఆరోగ్యం మళ్లీ సీరియస్

31
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన సోదరి స్పందించారు. ‘ఆయన చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడే రూంకి షిఫ్ట్ చేశాం. ఆయన తొందరలోనే కోలుకొని మీడియాతో మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఆయన చనిపోయాడంటూ వచ్చే వార్తలు నమ్మవద్దు.’ అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కానీ తాజాగా ఆయన ఆరోగ్యం మళ్ళీ సీరియస్ గా ఉంది.

శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి తాజాగా ప్రకటించింది. ఆయనకు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించారు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. హీరోగా శరత్ బాబు తొలిచిత్రం రామరాజ్యం 1973లో వచ్చింది.

Also Read:బంగాళాఖాతంలో తుపాను..భారీ వర్ష సూచన

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అలరించారు. మూడు నంది పురస్కారాలను అందుకున్నారు. నటి రమాప్రభను ఆయన వివాహం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.

Also Read:మైసూరు పులి…టిప్పు సుల్తాన్

- Advertisement -