మొక్కలు నాటిన నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణీ నారాయణ

755
narayana
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం చాలా ఉదృతంగా ముందుకు కొనసాగుతుంది. దీనిలో భాగస్వాములు కావడానికి వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

ఈ చాలెంజ్ లో భాగంగా ప్రముఖ నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణీనారాయణ ఇవాళ మాదాపూర్ లోని తన నివాసంలో తన కుమారుడు గంట జిష్ణుఆర్యన్ తో కలిసి మొక్కలు నాటారు.

రోజురోజుకు మారిపోతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలంటే వారికి చదువుతో పాటు మంచి వాతావరణాన్ని అందించాలని. అందుకోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ ఒక్క ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఇంస్టాగ్రామ్ లో ఉన్న నా మిత్రులందరూ ఈ చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -