ఓటమి ఎరుగని నేత..14 సార్లు విజయబావుట

372
sharad pawar
- Advertisement -

శరద్ పవార్..రాజకీయాల గురించి కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు.ఎన్సీపీ అధ్యక్షుడిగా,కేంద్రమంత్రిగా,బీసీసీఐ చీఫ్‌గా తనదైన ముద్రవేసిన పవార్‌ 50 ఏళ్లుగా ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పటివరకు 14 సార్లు అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన పవార్ ఓటమి అనేది తెలియని నేత.

మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు పవార్. 1940 డిసెంబర్ 12న జన్మించిన పవార్ 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ తరపున బారమతి నుండి 1967లో పోటీచేసిన పవార్ తర్వాత 1978,1983,1985 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆరుసార్లు లోక్ సభ ఎంపీగా గెలిచిన పవర్ కేంద్ర రక్షణ, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా,బీసీసీ ఐ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.2010 నుండి 2012 వరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందారు. కాంగ్రెస్‌తో విభేదించి ఎన్సీపీ పార్టీని స్ధాపించారు. మహా రాజకీయాల్లో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్న పవార్‌ ఈ సారి ఎన్నికల్లో పోటీచేయడం లేదు.

- Advertisement -