రైతు సమస్యలపై ప్రధానితో చర్చించా: పవార్

422
pawar

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్. పార్లమెంట్‌లో ప్రధానితో దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రైతు సమస్యలపై మూడు పేజీల లేఖను అందజేశారు పవార్.

దాదాపు 54 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రధానికి తెలిపారు పవార్. నాసిక్, నాగపూర్ జిల్లాలలో స్వయంగా పంట నష్టాలను స్వయంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున తక్షణమే కేంద్రం జోక్యం చేసుకొని సహాయక చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పంట నష్టంతో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలని ప్రధానిని కోరినట్లు వెల్లడించారు శరద్ పవార్.

Sharad Pawar met Prime Minister Narendra Modi over the farm crisis in Maharashtra, causing a buzz in the middle of intense political activity