దసరా రేసులో ఆది సాయికుమార్‌ ష‌ణుఖ్మ‌!

24
- Advertisement -

నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన మరో పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఆది సాయికుమార్‌, అవికాగోర్‌ ఉత్కంఠగా నడిచివస్తున్న ఈ పోస్టర్‌లో అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ ‘ఇదొక డివోషనల్‌ థ్రిల్లర్‌. ప్రతి సన్నివేశంలోనూ ఓ పాజిటివ్‌ వైబ్‌, మ్యాజిక్‌ వుంటుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో మెస్మరైజ్‌ చేసే విధంగా వుంటుంది డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది* అన్నారు.

Also Read:TTD:జనతా క్యాంటీన్లపై ఈవో ప్రత్యేక దృష్టి

- Advertisement -