షంషేరా మూవీ @ ఓటీటీ!

73
shamshera
- Advertisement -

కపూర్‌ వారసత్వం నుంచి వచ్చిన చాకోలెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో రీసెంట్‌గా నటించిన చిత్రం షంషేరా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గత నెల జూలై 22న భారీ అంచనాల నడమ విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక చతికిలపడిపోయిన షంషేరా… తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల చేసినట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది.

సంజు సినిమా అనంతరం దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత రణ్‌బీర్‌ నటించిన మూవీ ఇదీ బాలీవుడ్‌ మున్నాబాయీ సంజయ్‌దత్‌ వాణీకపూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో నాగార్జున ప్రమోట్‌ చేసిన ఈ సినిమా అంతగా ప్రేక్షకుల మదిని తాకలేకపోయింది.
రణ్‌బీర్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న చిత్రంగా నిలిచిన ఎక్కువ రోజులు మాత్రం మార్కెట్‌లో నిలబడలేకపోయింది.

- Advertisement -