చిరంజీవి అల్ టైం బ్లాక్ బస్టర్ మూవీల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ముద్దు ముద్దు మాటలతో బబ్లీ బుగ్గలతో ఆకట్టుకున్న బేబీ షామిలిని ఎవరూ మర్చిపోలేరు. పెద్దయ్యాక సిద్దార్థ్ ఓయ్ మూవీతో ఆకట్టకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో వెండితెరకు దూరమైంది
తాజాగా మళ్లీ అమ్మమ్మ గారిల్లుతో ప్రేక్షకుల ముందుకురానుంది. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా జరుపుకుంటోంది. సుందర్ సూర్య అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీని ఎన్ఆర్ఐలు నిర్మిస్తున్నారు.
దర్శకుడిగా మారిన కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ చాయాగ్రహణం అందిస్తుండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాస్తున్నారు. సమ్మర్ లోపు షూటింగ్ ఫినిష్ చేసి మంచి డేట్ లో విడుదల చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. షామిలి మాత్రం ఓయ్ సినిమాలోలాగా బొద్దుగా కాకుండా బాగా స్లిమ్ గా మారడం ప్లస్ అవుతోంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.