బాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి హీరోయిన్

420
Shalini pandey
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శాలిని పాండే. అర్జున్ రెడ్డి మూవీ ఘన విజయం సాధించడంతో అమ్మడుకు రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చినా అవి పెద్దగా హిట్ అవ్వలేదు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, కళ్యాణ్ రామ్ 118, ఎన్టీఆర్ కథానాయకుడు మూవీల్లో నటించినా అందుకు శాలిని పాత్రకు పెద్దగా పేరు రాలేదు.

శాలిని ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య తమన్నా జంటగా వచ్చిన 100% లవ్ సినిమాను తమిళ్ లో జీవా గోరిల్లా పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈమూవీలో హీరోయిన్ గా శాలినికి అవకాశం వచ్చింది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ను శాలిని కొట్టేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో మూడు సినిమాలకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

బాలీవుడ్ హీరో రణ్‌ వీర్ సింగ్ సరసన నటించే అవకాశం వచ్చిందని బీ టౌన్ లో ప్రచారం జరుగుతుంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ రణ్ వీర్ సింగ్‌తో ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ అనే సినిమాను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో రణ్‌ వీర్‌కు జంటగా మొదటగా సారా అలీఖాన్‌, అనన్యా పాండే వంటి స్టార్‌ కిడ్స్‌ పేర్లు వినిపించినా… చివరకు వాళ్లందరిని కాదని శాలినీని ఎంపిక చేశారట. ఇందుకు సంబంధించిన అగ్రీమెంట్ పై శాలిని సంతకం కూడా చేసిందట. అంతేకాదు యశ్ రాజ్ ఫిల్మ్స్ లో వరుసగా మూడు సినిమాలు చేయాలని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట. ఒకేసారి బాలీవుడ్ లో మూడు సినిమాలకు అవకాశం రావడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేవని చెప్పుకోవాలి.

- Advertisement -