శైలజా రెడ్డి అల్లుడు టీజర్ వచ్చేసింది…

77
Shailaja Reddy

మారుతీ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటించగా… నాగచైతన్య సరసన అనూ ఇమాన్యుయేల్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ..పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా పొట్టంతా ఈగోనే.. అంటూ రఘుబాబు డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతోంది. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చెయి.. ఐ లవ్ యూ టూ అని యాక్సెప్ట్ చేస్తా అని నాగచైతన్యతో హీరోయిన్ అనూ ఇమాన్యయేల్ అనడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Shailaja Reddy Alludu

ఆ తరువాత పిల్లే ఇలా ఉంటే తల్లి ఎలా ఉంటుందో అని చైతూ డైలాగ్ చెప్పడం, శైలజా రెడ్డి రమ్యకృష్ణ సీరియస్ గా నడుచుకుంటూ రావడం హైలెట్ నిలుస్తున్నాయి. మారుతీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. నాగ చైతన్య అత్త పాత్రలో రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలెట్ నిలుస్తుందని అంటున్నారు.లవ్ అండ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ పై మీరు ఒక లుక్కెయ్యండి మరి.