ఉరిశిక్షపై షేక్ హసీనా

4
- Advertisement -

గత ఏడాది జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై ఘోరమైన అణచివేతకు పాల్పడినట్లు తేల్చిన స్పెషల్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.

ఈ నేపథ్యంలో ఉరిశిక్షపై స్పందించారు షేక్ హసీనా. ఈ తీర్పు మోసపూరితమని.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని వెల్లడించారు.

హసీనా అమానవీయ నేరాలకు పాల్పడినట్లు నిర్ధరించిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గతేడాది జరిగిన విద్యార్థి ఆందోళనలను అణచివేయడంలో అమానుష నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను షేక్ హసీనా ఎదుర్కొంటున్నారు.

Also Read:‘అఖండ 2’ ..ఎంజాయ్ చేస్తారు!

- Advertisement -