పేదరిక నిర్మూలనపైనే ఫోకస్:షేక్ హసీనా

182
haseena
- Advertisement -

భారత్‌కు వచ్చిన ప్రతిసారి సంతోషంగా ఫీలవుతానని తెలిపారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రాష్ట్రపతి భవన్‌లో షేక్ హసీనాకు ఘనస్వాగతం లభించగా అనంతరం మాట్లాడిన ఆమె.. భార‌త్ త‌మ‌కు మంచి ఫ్రెండ్ అని తెలిపారు.

పేద‌రిక నిర్మూల‌న‌, ఆర్థిక వృద్ధిపైనే త‌మ ఫోక‌స్ ఉన్న‌ట్లు ఆమె తెలిపారు. బంగ్లా, ఇండియాతో పాటు ద‌క్షిణాసియా ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి రెండు దేశాలు పాటు ప‌డాల‌ని హ‌సీనా అన్నారు.

విముక్తి పోరాట స‌మ‌యంలో ఇండియా ఇచ్చిన స‌హాకారాన్ని మ‌రిచిపోలేమ‌న్నారు. త‌మ మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధం ఉంద‌ని హ‌సీనా అన్నారు. ఒక‌రికి ఒక‌రు స‌హ‌క‌రించుకుంటున్న‌ట్లు ఆమె చెప్పారు. ఫ్రెండ్‌షిప్‌తో ఎటువంటి స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించ‌వ‌చ్చు అన్నారు.

- Advertisement -