సలార్ దెబ్బకు షారుఖ్‌ ఔట్?

18
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాలార్ మరియు బాలివుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న డంకి.. ఈ రెండు మూవీస్ కూడా క్రిస్మస్ బరిలో బిగ్ ఫైట్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22 న ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల తేదీలను ప్రకటించడంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు జరగని బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుందని భావించారంతా. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ బాలివుడ్ లో ఫిక్స్ స్టేజ్ లో ఉంది. అక్కడి స్టార్ హీరోలను సైతం తలదాన్నెలా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మన డార్లింగ్. బాహుబలి సిరీస్ తరువాత ఆ స్థాయి విజయం దక్కకపోయినప్పటికి ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. .

ఇక ఇప్పుడు వస్తున్న సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఇండియన్ సినీ అభిమానులు ఈ మూవీ కోసం కళ్ళు కాయలు కచేలా ఎదురు చూస్తున్నారు. అటు డీలా పడ్డ బాలివుడ్ ను తన బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో వరుసగా రెండు సార్లు వెయ్యి కోట్లు అందుకున్న హీరోగా షారుక్ ఖాన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అంతే కాకుండా డంకి మూవీకి రాజ్ కుమార్ హీరాణి దర్శకుడు కావడంతో ఆ మూవీపై బాలివుడ్ లో అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి.

Also Read:బీఆర్ఎస్‌లోకి మెదక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి

దీంతో డంకి, సలార్ రెండు బడా సినిమాలే కావడంతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ అని డిసైడ్ అయ్యారంతా. అయితే ఈ రేస్ నుంచి తాజాగా షారుక్ ఖాన్ తప్పుకున్నట్లు బాలివుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. షారుక్ మూవీని వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే షారుక్ ఖాన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. దానికి తోడు ఇప్పుడు బరిలో ప్రభాస్ ఉండడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావించి డంకి మూవీని 2024 జనవరి 26కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో షారుక్ ఖాన్ రేస్ నుంచి తప్పుకోవడంతో ఇక ప్రభాస్ కు తిరుగులేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:World Cup 2023: భారత స్పిన్నర్లతో ప్రమాదమే!

- Advertisement -