షారూఖ్‌తో బన్నీ నిజమేనా?

22
- Advertisement -

కొన్ని కాంబినేషన్స్ వింటేనే చాలు ఓ కిక్ వస్తుంది. తాజాగా బన్నీ ఫ్యాన్స్ కి అదే కిక్ పొందుతున్నారు. అవును ఎవరూ ఊహించని కాంబో న్యూస్ బయటికొస్తే ఇలానే ఉంటుంది మరి. విషయంలో కేళితే షారూఖ్ ఖాన్ తో అట్లీ జవాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ మూవీను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. షారూఖ్ ‘పఠాన్’ తో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

సినిమాలో ఓ స్పెషల్ కెమియో ఒకటుంది. దాన్ని పుష్ప తో బాలీవుడ్ లో ఫేమస్ అయిపోయిన బన్నీ తో చేయించాలని షారూఖ్ , అట్లీ డిసైడ్ అయ్యారట. ఓ డిసిషన్ తీసుకొని లేటెస్ట్ గా అల్లు అర్జున్ ను అట్లీ సంప్రదించాడని తెలుస్తుంది. అయితే బన్నీ నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ ఈ కాంబో పక్కా కుడిరే అవకాశం ఉందని తెలుస్తుంది.

తాజాగా పఠాన్ లో సల్మాన్ ఖాన్ తో ఓ కెమియో చేయించారు. సినిమాలో ఆ వారిద్దరి యాక్షన్ , సీన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు జవాన్ లో కూడా అల్లు అర్జున్ తో ఆ మేజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు షారుక్. ఇక బాలీవుడ్ బాద్షా అడిగితే బన్నీ యెస్ చెప్పకుండా ఉంటాడా ? చూడాలి . ఈ కాంబో సెట్ అయితే మాత్రం స్క్రీన్ మీద షారూఖ్ ను , బన్నీ ను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -