కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో పాటు హీరోయిన్ కత్రినా కైఫ్ ,ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్‌తో పాటు పలువురు నటులకు వైరస్ సోకింది.
గతనెలలో నిర్మాత కరణ్ జోహర్ 50వ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివచ్చారు. ఈ పార్టీకి వచ్చిన వారిలో 55 మందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్‌కు జూన్ 1న, కార్తీక్ ఆర్యన్‌కు జూన్ 4న కరోనా పాజిటివ్‌గా వచ్చిందని అధికారులు తెలిపారు.
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ చిత్రంలో హీరోగా నటిస్తుండగా , కత్రినా కైఫ్.. విజయ్ సేతుపతితో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్లో ప్రముఖులు కరోనా బారిన పడటం చర్చనీయాంశంగా మారింది.