తెరపైకి మరో క్రేజీ కాంబినేషన్

17
- Advertisement -

దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా స్టార్ హీరోలతో వరుసగా మూవీస్ చేసుకుంటూ వస్తున్నాడు. సలార్ 2 తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే, కేజిఎఫ్ రెండు పార్ట్స్, సలార్ తో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కూడా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే, ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో హీరో సూర్య డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

యాక్షన్ చిత్రాలతో పాటు కంటెంట్ బేస్డ్ కథలు కూడా చేయడానికి హీరో సూర్య ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. పైగా సూర్య వరుసగా విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం సూర్య హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తోంది. ఐతే,ఈ మూవీని కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాలని సన్నాహాలు చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి సైన్ చేశాడు.

ఆ సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఈ లోపు మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమాకి కమిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సూర్య సినిమాని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ చర్చల దశలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య కోసం ప్రశాంత్ నీల్ మంచి స్టోరీ లైన్ సిద్ధం చేసుకునే పనిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ – సూర్య కాంబినేషన్ లో సినిమా పడితే మాత్రం కచ్చితంగా కోలీవుడ్ లో అదో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read:బీజేపీతో దోస్తీ.. రేవంత్ బయట పెట్టారా?

- Advertisement -