సౌత్ మార్కెట్ పై ఫుల్ ఫోకస్!

61
- Advertisement -

షారుఖ్ ఖాన్ కి “జవాన్, పఠాన్” సినిమాలతో తెలుగునాట బాగానే క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలలోని యాక్షన్ విజువల్స్ కారణంగా ఆ రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు “డంకీ” చిత్రంతో సౌత్ లో షారుఖ్ ఖాన్ కి మరింత మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. “జవాన్” తెలుగు వెర్షన్ ఏకంగా 25 నుంచి 35 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది అని అంచనా. ఏపీ, తెలంగాణాలో ఈ సినిమా తెలుగు, హిందీ వెర్షన్స్ కలిపి 82 కోట్ల నెట్ వసూల్ చేసింది. అంటే షారుఖ్ ఖాన్ కి సాలిడ్ మార్కెట్ ఏర్పడినట్లే. ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింతగా పెంచడానికి షారుఖ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

నిజానికి ఏపీ, తెలంగాణలో ఇంతకుముందు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కి మంచి మార్కెట్ ఉండేది. కానీ, వరుస ప్లాప్స్ కారణంగా వాళ్ళకి ఇప్పుడు సౌత్ లో మార్కెట్ భారీగా పడిపోయింది. కానీ, వరుసగా తన సినిమాలను తెలుగులో డబ్ చెయ్యడమే కాదు…. సినిమాల ప్రొమోషన్ కోసం హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలకు తరుచుగా వస్తూ షారుఖ్ ఖాన్ ఇక్కడ వరుసగా జవాన్ – పఠాన్ సినిమాల రూపంలో రెండు హిట్స్ అందుకున్నాడు. పైగా ఇకపై చేసే తన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చెయ్యాలని షారుఖ్ ఖాన్ ఫిక్స్ అయ్యాడు.

ఈ క్రమంలోనే తెలుగులో ఏసియన్స్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు టాక్. అలాగే, మహేష్ బాబుతో కలిసి ఇక్కడ తన సినిమాలకు ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరో. నార్త్ లో షారుఖ్ కి తిరుగులేదు. కానీ, సౌత్ లో మాత్రం ఆ రేంజ్ స్టార్ డమ్ ను షారుఖ్ సొంతం చేసుకోలేకపోయాడు. అందుకే, ప్రస్తుతం తన నుంచి రాబోయే సినిమాల విషయంలో సౌత్ పై మరింత ఫోకస్ పెట్టబోతున్నాడు. మరి షారుఖ్ సౌత్ బాట ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

Also Read:తపాలా శాఖ..కొత్త స్టాంప్ రిలీజ్

- Advertisement -