గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం జెర్సీ . బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీతో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ కానుండగా అర్జున్ రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేషన్ చేసిన షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు.
బాలీవుడ్‌లో తొలుత ఈ ప్రాజెక్టును కరణ్ జోహర్ రీమేక్ చేస్తారని అంతా భావించారు కానీ అమన్ గిల్‌తో కలిసి టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా హిందీ రీమేక్‌ను నిర్మించనున్నారు.
జెర్సీ ఒరిజినల్ వర్షన్‌ను రూపొందించిన గౌతం నన్నూరినే దర్శకత్వం వహించనున్నారు. 2020 ఆగస్టులో మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ రూ. 40 కోట్ల మేర రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.