ఒక్క హిట్ రూ.40కోట్లు డిమాండ్ చేస్తున్న హీరో

396
Shahid Kapoor
- Advertisement -

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈసినిమా తర్వాత తెలుగులో ఆయనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ తీశాడు. అక్కడ కూడా ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. బాలీవుడ్ బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిన ఈసినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు.

ఇక ఈసినిమా ఘన విజయం సాధించడంతో షాహిద్ కపూర్ ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇక తన తర్వాతి సినిమాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశాడు. తెలుగులో నాని నటించని జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్. అయితే ఈమూవీలో హీరోగా షాహిద్ కపూర్ ను సంప్రదించాదట. స్టోరీ విని ఓకే చెప్పిన షాహిద్ రెమ్యూనరేషన్ కూడా చెప్పాడట.

ఈసినిమాకు తనకు రూ.40కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. ఇది విన్న కరణ్ జోహర్ మొదట షాకైనా…ఈ తర్వాత ఇందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. థర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈసినిమాకు హిందీలో ఎవరు తెరకెక్కిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -