వైరల్ : చరణ్ కి షారూఖ్ ట్వీట్

63
- Advertisement -

షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘పటాన్’ జనవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పటాన్ ట్రైలర్ ను ట్విటర్ లో ట్వీట్ చేసి షారూఖ్ ఖాన్ ను మెచ్చుకున్నాడు. ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకున్నారు చరణ్.

చరణ్ ట్వీట్ కి షారూఖ్ ఖాన్ వెంటనే రిప్లై ఇచ్చాడు. థాంక్యూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ ట్వీట్ చేశాడు షారుఖ్. ఆ ట్వీట్ లోనే మీ RRR టీం ఆస్కార్ ఇంటికి తెచ్చినప్పుడు ఒకసారి దాన్ని టచ్ చేయనివ్వండి” అంటూ ట్వీట్ చేయడంతో షారూఖ్ ట్వీట్ వైరల్ అవుతుంది. చరణ్ మళ్ళీ షారూఖ్ కి థాంక్స్ చెప్తూ తప్పకుండా సర్ , అవార్డు మన ఇండియన్ సినిమా సొంతం అంటూ తెలిపాడు.

ట్విటర్ లో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ , టాలీవుడ్ స్టార్ చరణ్ ఇద్దరూ తమ బందాన్ని ఇలా వ్యక్త పరుచుకున్నారు. అలాగే తమిళ్ లో ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ కి కూడా షారూఖ్ థాంక్స్ చెప్తూ ట్వీట్ వేశాడు.

ఇవి కూడా చదవండి…

ఆస్కార్ బరిలో ది కాశ్మీర్ ఫైల్స్‌

లెజెండ్స్‌తో నటించడం నాఅదృష్టం..

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాం

- Advertisement -