బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ శనివారం భారతదేశంలోని కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షారుక్ ఖాన్, మెస్సీ అభిమానులు ఈ వీడియోను చూసి ఉత్సాహంతో ఊగిపోతున్నారు.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో షారుక్ ఖాన్ మెస్సీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తన చిన్న కుమారుడు అబ్రామ్ కూడా ఉన్నాడు. వైరల్ వీడియోలో మెస్సీ, షారుక్ కుమారుడు అబ్రామ్‌తో కలిసి ఫోటోలు వైరల్‌గా మారాయి.
షారుక్ ఖాన్ – మెస్సీ కలిసి కనిపించడంతో నెట్టింట అభిమానుల సందడి మొదలైంది. ఒక నెటిజన్ ..“బాలీవుడ్ ఫుట్‌బాల్ రాజవంశాన్ని కలిసిన క్షణం, షారుఖ్ ఖాన్, లియోనల్ మెస్సీ ఒకే ఫ్రేమ్‌లో అంటే ఇదే అసలైన స్టార్ పవర్ అని ట్వీట్ చేశాడు.
మరో యూజర్, ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టార్ షారుక్ ఖాన్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా దిగ్గజం లియోనల్ మెస్సీని కోల్‌కతాలో కలిశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణం అంటూ వ్యాఖ్యానించాడు.
లియోనల్ మెస్సీ డిసెంబర్ 15, 2025 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ‘GOAT ఇండియా టూర్ 2025’ లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబయి, న్యూఢిల్లీ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కోల్‌కతాలో షారుక్ ఖాన్ మెస్సీని కలిసిన తర్వాత, ముంబయిలో కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మెస్సీని కలిసే అవకాశం ఉందని సమాచారం. జాన్ అబ్రహామ్, కరీనా కపూర్ ఖాన్, జాకీ ష్రాఫ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
Also Read:గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?

