ఫ్యాన్స్‌ పై షారుక్‌ ట్వీట్‌..

201
- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ తనంకంటూ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు ప్రయాణాలు చేయాలని, దేశమంతా తిరగాలనేది బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కోరిక. రైల్‌లో ఫస్ట్‌క్లాస్ ప్రయాణం చేస్తానని కూడా ఎప్పుడూ ఆయన అనుకోలేదు. కట్‌చేస్తే ఇప్పుడు షారుఖ్, దేశమే కాదు ప్రపంచాన్ని సైతం చుట్టేయగలడు.

 Shah Rukh Khan looks back on his 25 year old film journey in Mumbai ...

. Shah Rukh Khan looks back on his 25 year old film journey in Mumbai ...

.

అయితే షారుఖ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి నేటితో 25 ఏళ్లు పూర్త‌యింది. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు షారుక్‌. బాలీవుడ్‌లోకి రాక‌ముందు ఫౌజీ, స‌ర్క‌స్‌లాంటి టీవీ సీరియ‌ల్స్‌లో షారుఖ్‌ న‌టించాడు. దీవానా త‌ర్వాత డ‌ర్‌, బాజిగ‌ర్‌, అంజామ్‌లాంటి సినిమాల్లో నెగ‌టివ్ రోల్స్‌లో క‌నిపించాడు షారుక్‌.

ఈ 25 ఏళ్ల‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ సంపాదించుకున్న కింగ్ ఖాన్‌.. బాద్‌షా ఆఫ్ బాలీవుడ్ పేరు సంపాదించాడు. దిల్ వాలే దుల్హ‌నియా లేజాయేంగే, దిల్ తో పాగ‌ల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మొహ‌బ్బ‌తేలాంటి రొమాంటిక్ సినిమాల్లో న‌టించి.. బాలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో షారుక్ త‌న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఇన్నేళ్లుగా న‌న్ను భ‌రించినందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు.

Shah Rukh Khan looks back on his 25 year old film journey in Mumbai ...

 Shah Rukh Khan looks back on his 25 year old film journey in Mumbai ...

.

హిందీ సినిమా ఇండ‌స్ట్రీకి షారుక్ అందించిన సేవ‌ల‌కుగాను అత‌న్ని ప‌ద్మ‌శ్రీతో స‌త్క‌రించింది భార‌త ప్ర‌భుత్వం. అటు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఫ్రాన్స్ కూడా రెండు అత్యున్న‌త అవార్డుల‌తో అత‌నికి త‌గిన గుర్తింపునిచ్చింది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో షారుక్‌కు చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా పేరున్న డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్.. ఈ సంద‌ర్భంగా అత‌నికి శుభాకాంక్ష‌లు చెప్పాడు. షారుక్ 25 ఏళ్ల అనుభ‌వంలో 22 ఏళ్లు అత‌నితో క‌లిసి ప‌నిచేసే చాన్స్ త‌న‌కు దొరికింద‌ని క‌ర‌ణ్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం షారుక్ త‌న లేటెస్ట్ మూవీ జ‌బ్ హ్యారీ మెట్ సెజాల్ ప్ర‌మోష‌న్ వ‌ర్క్‌లో ఉన్నాడు. ఈ మూవీ ఆగ‌స్ట్ 4న రిలీజ్ కానుంది.

- Advertisement -