బాద్‌ షా కారులో భాయిజాన్ షికార్..

204
Shah Rukh Khan gifts Salman Khan a brand new Mercedes
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కారును బహూకరించిన సంగతి తెలిసిందే. కొంత కాలం ఎడముఖం పెడముఖంగా ఉన్న వీరిద్దరూ కలిసిన అనంతరం మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తూ అత్యంత సన్నిహితంగా గడుపుతున్నారు. ఇటీవలె ముంబై వీధుల్లో సైకిల్ తొక్కిన సల్మాన్‌….షారుఖ్‌ ఇంటికి రాగానే షారుఖ్ షారుఖ్ అంటూ కేకలు వేస్తూ అల్లరి చేసిన సంగతి తెలిసిందే.

Shah Rukh Khan gifts Salman Khan a brand new Mercedes
ఈ మధ్య ఒకరి సినిమాలు ఒకరు ప్రమోట్ చేసుకోవ‌డ‌మే కాకుండా గెస్ట్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి ఆనందాన్ని అందిస్తున్నారు. సల్మాన్ నటించిన తాజా చిత్రం ట్యూబ్ లైట్ లో షారూఖ్ అతిధి పాత్రలో కనిపించి మెరిశాడు. ఇక ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారూఖ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడట. ఈ క్రమంలో రీసెంట్ గా సెట్ కి వచ్చాడట బాయిజాన్. అప్పుడు తన ఫ్రెండ్ కి కృతజ్ఞతగా ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడట షారూఖ్.

సల్మాన్ ప్రస్తుతం టైగర్ జిందా హై అనే చిత్రంలో నటిస్తుండగా, ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇక షారూఖ్ ఇంతియాజ్ అలీ డైరెక్షన్లో జబ్ హ్యారీ మెట్ సెజల్ అనే మూవీతోను బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కానున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షారూఖ్ కారులో సల్మాన్ అంటూ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ అగ్రహీరోల స్నేహానికి గుర్తు అంటూ ఈ కోరు ఫోటోను వారి అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.

- Advertisement -