ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ‘బాహుబలి చిత్రం గురించి మాట్లాడని సినిమా ప్రేక్షకుడు లేడు. ప్రపంచ సినిమా ప్రేక్షకుడి కి తెలుగు సినిమా ని పరిచయం చేసిన ఘనత బాహుబలి మాత్రమే.. తెలుగు సినిమా సత్తాని దమ్ముని తెలియ జేసిన బాహుబలి చిత్రం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ నటిస్తున్న చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ సాహోకి దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కింది ఈ చిత్రం.
యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో ” విడుదల చేశారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ డిజైన్ చేసిన హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను దుబాయ్ లో ఎలా షూట్ చేశారో చూపిస్తూ సాగిన ఈ మేకింగ్ వీడియో ను చూసిన ప్రేక్షకులందరూ థ్రిల్ అయ్యారు.
విడుదలైన జస్ట్ 24 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇలాంటి రెస్పాన్స్ మరే తెలుగు హీరో మేకింగ్ వీడియోకి ఇంతవరకూ రాలేదు. ఇక ఈ వీడియోకు యూట్యూబ్ లో నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియా మొత్తం మీద వన్ మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. ఒక మేకింగ్ వీడియో విషయంలో ఇదో పెద్ద రికార్డు. సాహో మేకింగ్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ తో చిత్రయూనిట్ ఉబ్బితబ్బైపోతోంది.