- Advertisement -
భారత మహిళా క్రికెట్ టీంని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ‘శభాష్ మిథు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిథాలీ పాత్రను తాప్సీ పోషిస్తుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్న శభాష్ మిథు సినిమాకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.
ఈ ట్రైలర్‌లో మిథాలీ రాజ్ ఎలా క్రికెటర్ గా ఎదిగింది? లేడీ క్రికెటర్‌గా ఎదర్కొన్న అవమానాలు, టీంతో కలవడం, తన ఆటని, ఇండియన్ మహిళా క్రికెట్ సమస్యల్ని నిలదీయడం, తన కెప్టెన్సీతో ఇండియన్ మహిళా టీంని ఎలా అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిందో చూపించారు. కథ ఎలా ఉండబోతుంది అని ట్రైలర్ లో చూపించారు. జులై 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.
- Advertisement -

