జగదీష్ రెడ్డి సమక్షంలో TRSలో భారీగా చేరికలు..

65
Minister Jagadish Reddy
- Advertisement -

మారుమూల తాండలలో గులాబి జెండా రెప రెప లాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు గూడెం గుడిసెలలో ఉండే వారిని టిఆర్‌ఎస్ అక్కున చేర్చేలా చేస్తున్నాయి.దేశానికే తలమానికంగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన అభివృద్ధి నమూనాపై జరుగుతున్న చర్చ ఇప్పుడు తాండాలలకి పాకింది.ఈ క్రమంలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలా నిమిత్తం తాండాలలకి చేరుతున్న నాయకుల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరేందుకు గిరిజనులు బారులు తీరుతున్నారు. అందులో మహిళలు మీ వెంట మేము అంటూ టిఆర్‌ఎస్‌కు జైకొడుతూ గులాబీ జెండాలు చేభూని టిఆర్‌స్‌లో చేరుతున్న తంతు నాయకులను సైతం సంబ్రమాచర్యాలకు గురి చేస్తోంది.

శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండలం పాత తండాలో సరిగ్గా ఇదే సన్నివేశం చోటు చేసుకుంది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి మంత్రి జగదీష్ రెడ్డి మంజూరు చేసిన 6 లక్షల అంచనా వ్యయం తో ఏపపూరులో నిర్మించిన ప్రయాణికుల ప్రాంగణం (బస్ షెల్టర్)ను ఆయన ప్రారంభించారు. అనంతరం 95 లక్షల అంచనా వ్యయంతో కొత్త తండా నుండి కాకి తండా వరకు 1.6 కిలో మీటర్ల మేర నూతనంగా నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.

మార్గం మధ్యలో లక్మా తండా వద్ద గిరిజన మహిళలు మంత్రి జగదీష్ రెడ్డి వాహనాన్ని ఆపి మరీ తమ గ్రామానికి కావలసిన రహదారి,బ్రిడ్జి నిర్మాణపు పనుల విషయాన్ని ప్రస్తావించగా అందుకు అనుకూలంగా ఆయన హామీ ఇచ్చారు.చివరిగా కాకితండాలో జరిగిన సభలో గిరిజన మహిళలు తమకు తాము గుంపులు గుంపులుగా తరలి వచ్చి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి అహ్వానించారు.

- Advertisement -