పాదయాత్రలు కాదు..రిలే యాత్రలు!

115
padayathra
- Advertisement -

రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం కొత్తేమీ కాదు. అలా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వారిలో తెలుగు రాష్ట్రాల నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వారే. కష్టకాలంలో ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. అలాగే పాదయాత్రలు చేసి ఉనికిని కొల్పోయిన వారు ఉన్నారు. ఇక తాజాగా ఇప్పుడు తెలంగాణలో షర్మిల,కేఏ పాల్, బండి సంజయ్‌ చేస్తున్న పాదయాత్ర అలాంటిదే. ఇదే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులే కాదు ప్రజలు సైతం బహిరంగంగానే చెబుతున్నారు.

ఒకప్పుడు పాదయాత్ర అంటే బ్రేక్ లేకుండా వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు బ్రేక్‌లు బ్రేక్‌లు.. సినిమాల్లో టేక్‌ల్లాగా పది రోజులు నడిచి నెల రోజులు బ్రేక్‌. అందుకే వీరు చేస్తున్న పాదయాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజల నుండి స్పందన రాకపోవడంతో కేఏపాల్ డ్యాన్స్‌లతో రచ్చ చేస్తుంటే బండి సంజయ్, షర్మిల తమ నోర్లకు పదను చెబుతున్నారు. ఒకరేమో అభివృద్ధి గురించి మాట్లాడకుండా హిందూ, ముస్లిం పేరుతో ప్రజల్లో విద్వేశాలు రెచ్చగొట్టడం, మైనార్టీలు ఉండే ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మాట్లాడి రాజకీయ లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక షర్మిల అయితే సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులే టార్గెట్. అందుకే వీరి యాత్రలకు జనం నుండి స్పందన అంతంత మాత్రమే. పైగా ఈ యాత్రలకు జనాలను అరువు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే బ్రేక్‌లు బ్రేక్‌లుగా యాత్రలను చేస్తూ అదే జనాన్ని అన్నిచోట్ల తిప్పుతూ ప్రజల నుండి అనూహ్య స్పందన అంటూ గోబెల్స్ ప్రచారానికి తెరలేపిన స్ధానికంగా మాత్రం ప్రజల నుండి స్పందన వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో సైతం వీరి పాదయాత్రపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతా ఒకే సారి పాద యాత్ర బదులు …. రిలే పాద యాత్ర చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అంటే ఒకరు ఆపిన చోటు నుంచి ఇంకొకరు మొదలు పెడితే కొత్త ట్రెండ్ అవుతుంది…డబ్బులు కూడా ఆదా అవుతాయని జోకులు పేలుస్తున్నారు.

అందుకే బండి ఇంకా 100 ప్రజా సంగ్రామ యాత్రలు చేసినా, షర్మిలా 3 వేలు కాదు 30 వేల కిలోమీటర్లు నడిచినా, కామెడీ కేఏ పాల్‌ ఎన్ని డ్యాన్స్‌లు వేసినా ప్రజల్లో నవ్వుల పాలవడం తప్ప వారి ఆదరణ దక్కించుకోవడం కష్టమే. తెలంగాణ సమాజ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తూ సాగుతున్న అవివేకపు యాత్ర మానుకొని ఇప్పటికైనా సొంతరాష్ట్రం ఏపీకి పోవాలని పలువురు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -