కోదండరాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

8
- Advertisement -

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తమపై తెలంగాణ హైకోర్టు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

శాసనమండలి సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ కేసు ప్రస్తుత దశలో తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది.

ముందుగా హైకోర్టులో పిటిషన్ వేసి, అక్కడ తిరస్కరణ వచ్చిన తర్వాత మా దగ్గరకు రండి అంటూ పిటిషనర్లకు సూచించింది. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కనీసం మరో వాయిదా ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. వారి విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేశారు.

ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్సీల సస్పెన్షన్ అంశం చర్చనీయాంశంగా మారగా, కోర్టు తీర్పులు ఈ వ్యవహారంలో కీలకంగా మారనున్నాయి.

Also Read:మెగాస్టార్‌ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

- Advertisement -