నువ్వులు తినడం మంచిదేనా!

21
- Advertisement -

నువ్వులను మన భారతీయులు అధికంగా తింటూ ఉంటారు. పరిమాణంలో ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికీ వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజన్నాయి. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు లభిస్తాయి. ఈ నువ్వులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ బి1, బి3, బి6 అధికంగా ఉంటాయి. ఇంకా కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్ వంటి మూలకాలు కూడా ఉంటాయి. నువ్వులను తినడం వల్ల గుండె జబ్బులు రావని చెబుతారు ఆరోగ్య నిపుణులు. ఇంకా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడంలో కూడా నువ్వులు ఎంతగానో ఉపయోగ పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా చలికాలంలో నువ్వులు తినడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు.

నువ్వులలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నువ్వులను తింటే శరీరంలో వేడి శాతం పెరుగుతుంది. చలికాలంలో వెచ్చగా ఉండేందుకు దోహదపడతాయి. ఇంకా చలికాలంలో చాలమంది మలబద్దకం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఓ గుప్పెడు నువ్వులు తింటే ఆ సమస్యలన్నీ దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా కండరాలకు సరైన ప్రోటీన్లను అందించడంలో కూడా నువ్వులు ఎంతగానో ఉపయోగ పడతాయట. నువ్వులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మూత్ర సమస్యలను తగ్గిస్తాయి. ఇంకా చలికాలంలో కొంతమంది ఆర్థరైటిస్, ఎముకలు బలహీన పడడం, వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు నువ్వులను తింటే అందులోని కాల్షియం కారణంగా ఎముకలు శక్తినొందుతాయి. ఇంకా కీళ్ల నొప్పుల సమస్యలు కూడా దూరమౌతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:వైసీపీ నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం!

- Advertisement -