సెరెనా సంచలన నిర్ణయం…

132
- Advertisement -

నల్లకలువ, అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ తర్వాత టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపింది. జీవితంలో ఏదో ఒక టైంలో విభిన్నమైన మార్గంలో ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోవల్సి వస్తుందని …ఆ నిర్ణయం కఠినంగా ఉండవచ్చని వెల్లడించింది.

40 ఏళ్ల టెన్నిస్ స్టార్ 23 సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచింది. 1995 లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా మారిన సెరెనా.. ఆ తర్వాత ఎన్నో కీర్తిశిఖరాలు అధిరోహించింది. 7సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, 3 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, 7 సార్లు లో వింబుల్డన్ ట్రోఫీ సాధించింది. ఇక 6 సార్లు యూఎస్ ఓపెన్ కైవసం చేసుకుంది.

యూఎస్ ఓపెన్ ఈ నెలలోనే ప్రారంభం కానుండగా ఈ ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధిస్తే.. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటి ల్స్ సాధించిన ప్లేయర్ గా మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న 24 టైటిల్స్ రికార్డును సమం చేస్తుంది.

- Advertisement -