#BoyapatiRAPO…సెప్టెంబర్ 15న విడుదల

45
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BoyapatiRAPO ముగింపు దశకు చేరుకుంది. మాసీవ్ ఎనర్జీ ముందుగానే థియేటర్లలోకి రానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయాలని మొదట భావించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ వైట్ అండ్ వైట్‌ సూపర్ చార్మింగ్‌గా కనిపిస్తున్నారు. తెల్లటి చొక్కా, లుంగీ ధరించి, పొలంలో కాఫీని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఈ చిత్రంలో రామ్ గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తారు. రామ్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు బోయపాటి.

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

Also Read: నిఖిల్..‘స్పై’పవర్ ప్యాక్డ్ ట్రైలర్

సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ , పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటింగ్‌ తమ్మిరాజు.

Also Read: లక్ష కోట్ల మెగా ప్రిన్సెస్ డిశ్చార్జ్

- Advertisement -