‘పుష్ప 3’లో ఆ సెంటిమెంట్

19
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. అయితే ఇప్పుడు ‘పుష్ప 2’ పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ 80 శాతం పూర్తయ్యినట్లుయిగా.. అలాగే, సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మూడో భాగం షూటింగ్ స్టార్ట్ చేస్తారని.. పైగా మూడో పార్ట్ కోసం విజయ్ దేవరకొండ డేట్స్ ను కూడా అడిగారని తెలుస్తోంది.

అయితే, ఇప్పుడు సుకుమార్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆర్య సినిమా ఫార్ములా ను పుష్ప 3 కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఆర్య కూడా యాంటీ లవ్ సెంటిమెంట్ నేపథ్యంలోనే చిత్రీకరించారు. పుష్ప 3 కూడా ఇంచుమించుగా అదే పాయింట్ చుట్టూ సాగుతుందట. కాకపోతే, విజయ్ దేవరకొండ ను రెండు డిఫరెంట్ పాత్రల్లో చూపించబోతున్నారట. మరోవైపు చాలా పవర్ ఫుల్ గా అల్లు అర్జున్ ను కూడా చూపిస్తారని తెలుస్తోంది.

మొత్తానికి దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ లను తండ్రీకొడుకుల పాత్రలలో చూపిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే, ఈ సినిమా కోసం కూడా బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:IND vs ENG : రాజ్ కోట్ లో సెంచరీల మోత!

- Advertisement -