క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని పక్కాగా వాడేసుకుంటూ ఛానల్స్ చుట్టూ తెగ తిరిగేస్తోంది నటి శ్రీ రెడ్డి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రచ్చ జరుగుతుండగా.. టాలీవుడ్ లో 99 శాతం మంది ఆడవాళ్లను వాడుకునేవారేనని ఇటీవలి కాలంలో వివిధ టీవీ చానళ్లలో స్పెషల్ డిస్కషన్లు పెడుతుంది శ్రీ రెడ్డి, టాలీవుడ్ ప్రముఖుల బాగోతాన్ని బయటపెడతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ అమ్మడు తన దగ్గర కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా బయట పెడతానని చెప్పింది. అన్నట్టుగానే శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఫోటోను పెట్టింది. ఇందులో ముఖం కనిపించని ఓ వ్యక్తి శ్రీ రెడ్డిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ‘లీక్స్ స్టార్టెడ్’ అంటూ శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుండగా, ఇలా ఈ హాట్ బ్యూటీ ఇంకా ఎందరి భాగోతాలు బయటపెడుతుందో చూడాలి మరి.