క్యాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ జ‌య‌ప్ర‌ద‌..

462
jayaprada
- Advertisement -

టాలీవుడ్ లో గ‌త కొద్ది రోజుల క్రితం క్యాస్టింగ్ కౌచ్ అనే అంశంపై ర‌చ్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. మొదట శ్రీరెడ్డి దినిపై యుద్దం చేసినా..ఆత‌ర్వాత మ‌రికొద్ది మంది ఆర్టిస్టులు ఆమెకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌గా..కొంత‌మంది విమ‌ర్శించారు. ఈవిష‌యంపై టాలీవుడ్ లో చాలామంది న‌టీన‌టులు క్యాస్టింగ్ అంశంపై స్పందించారు. తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నామ‌ని ప‌లువురు తెలిపిన విష‌యం తెలిసిందే. ఇండ‌స్ట్రీలో త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను పంచుకుంటున్నారు.

jayaprada

ఇక క్యాస్టింగ్ కౌచ్ పై సీనియ‌ర్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద స్పందించారు. త‌న‌కెప్పూడు క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేద‌ని..అలాంటి ఇబ్బందులు త‌న‌కెప్పుడూ ఎదురుకాలేద‌న్నారు. చిన్న‌ప్ప‌టి నుంచే సినిమాల్లోకి రావ‌డం వ‌ల్ల నాకూ అలాంటి అనుభ‌వం ఎదురుకాలేద‌న్నారు. తాను న‌టించిన సినిమాల‌న్ని విజ‌య‌వంతం కావ‌డమే దినికి కార‌ణం అన్నారు జ‌య‌ప్ర‌ద‌.

jayaprada

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల్లో ఉండ‌టం వ‌ల్ల నాకు ఇండ‌స్ట్రీలో అంద‌రూ ప‌రిచ‌యం ఉన్నవారేన‌ని..సినిమాల్లో పాత్ర‌ల కోసం తాను ఎవ‌రి వ‌ద్ద‌కూ వెళ్లి అడ‌గాల్సిన అవ‌సరం రాలేద‌న్నారు. సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి రావాల‌ని చాల‌మంది అమ్మాయిలు అనుకుంటున్నార‌న్నారు. ముంబాయ్ నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన చాలామంది అమ్మాయిలు అవ‌కాశాల కోసం ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల వ‌ద్ద‌కు వెళుతుంటార‌ని..అందుకే తెలుగు వాళ్ల‌కు ఎక్కువ అవ‌కాశాలు రావ‌డం లేద‌న్నారు.

- Advertisement -