- Advertisement -
సీనియర్ నటి వాణశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ కార్తీక్ హఠన్మారణం చెందాడు. చెన్నైలో గుండెపోటుతో చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన వయసు 36 ఏళ్లు కాగా అభినయ్‌కి భార్య, ఓ కుమారుడు (4) ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే.
ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న అభినయ్.. నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
దశాబ్ద కాలం పాటు తెలుగు చిత్ర సీమలో కథానాయికగా వెలిగిన కళాభినేత్రి వాణిశ్రీ.. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్నే వివాహం చేసుకున్న వాణిశ్రీకి ఒక కుమారుడు.. ఒక కుమార్తె ఉన్నారు.
- Advertisement -