విశ్వంభరలో సీనియర్ హీరోయిన్!

10
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో సీనియర్ హీరోయిన్‌ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ నటి ఖుష్బూ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించిన ఆమె ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతుండగా వెంటనే ఖుష్బుకు చెప్పగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా దాదాపు 18 ఏండ్ల త‌ర్వాత చిరంజీవితో క‌లిసి ఇందులో న‌టిస్తోంది. బింబిసారతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వశిష్ట..ఈ ఫాంటసీ సినిమాను చిరు రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు.

Also Read;‘చక్కి చలనాసనం’ వేస్తే ఎన్ని లాభాలో..!

- Advertisement -