సినీయర్ నటుడు శరత్‌బాబు మృతి

38
- Advertisement -

ప్రముఖ సినీయర్ నటుడు శరత్‌బాబు(71)మరణించాడు. శరత్ బాబు గత నెల రోజులుగా ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత క్షిణించినట్లు తెలిపారు. మృత్యువుతో పోరాడుతూ మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతి చెందారు. శరత్‌బాబు మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియాలో సంతాపం తెలిపారు. శరత్‌బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శరత్‌బాబు భౌతికాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ నటి రమాప్రభను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా వివాహమైన కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ అప్‌డేట్

ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన విజయశంకర దీక్షితులు సుశీలాదేవి కుమారుడే శరత్‌బాబు. ఈయన 1973లో విడుదలైన రామరాజ్యంతో హీరోగా పరిచమయ్యారు. దాదాపుగా 250కు పైగా సీతాకోక చిలుక, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, సాగరసంగమం, సంసారం ఒక చదరంగం, క్రిమినల్, అన్నయ్య, మగధీర ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా విలన్‌గా సహాయ నటుడిగా నటించారు. అంతేకాదు సినిమారంగంలోనే కాకుండా సీరియల్స్‌లోనూ రాణించారు. ఈటీవీలో ప్రసారమైన అంతరంగాలు ధారావాహిక ద్వారా బుల్లి తెరకు పరిచమయ్యారు.

Also Read: Bellamkonda Ganesh:నేను స్టూడెంట్ సార్

- Advertisement -