మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ‘రాజా ది గ్రేట్’ సినిమా ప్రీ- రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరుగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… .రవితేజ చాలా గ్రేట్ అన్నారు. ఏ నటుడు అయినా వెరైటీ పాత్రలు వేయాలని అనుకుంటాడని అన్నారు.
అయితే, ఇంత కమర్షియల్ హీరో, అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో, అంధుడిగా ఇంతటి అద్భుతమైన పాత్రను చేయడం మొదటిసారి అని రవితేజను ఉద్దేశించి అన్నారు.
ఈ సినిమా తరువాత రవితేజను అందరూ ‘ఓ గ్రేట్ యాక్టర్’ అని అంటారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాను హీరో వేషాలు వేసిన తరువాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తున్నానని, తనకి కూడా వెరైటీ పాత్రల్లో నటించాలని ఉంటుందని అన్నారు.
ఈ సినిమా బృందం ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. ‘సర్వేంద్రియానాం సర్వం ప్రధానం’ అని ఈ సినిమా రుజువు చేస్తుందని అన్నారు.