మానవత్వం అంటే ఇదేనేమో. విధి నిర్వహణలో తన ప్రాణాలను లెక్కచేయని సైనికుడు ఒకరు..తాము నమ్మిన సిద్ధాంతం కోసం పోరుబాట పట్టిన మావోయిస్టు మరోవైపు. వీరిద్దరు ఎదురుపడ్డారంటే తుపాకుల మోతమొగించాల్సిందే. అలాంటి శత్రువు ఎదురునిలబడి,ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణం పోసే ధైర్యం ఎంతమందికి ఉంటుంది. తోటి మనిషి ప్రాణం విలువ తెలిసినవాడే వారి ప్రాణం నిలిపేందుకు పరితపిస్తాడని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.
209 కమాండో బెటాలియన్‌కు-నక్సల్స్ మధ్య ఇటీవల హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ నక్సల్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎమర్జెన్సీగా రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పడంతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాజ్‌కమల్ వెంటనే రక్తం ఇచ్చి, నక్సల్ ప్రాణాలు కాపాడారు.
జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో ఆ జవాన్ని హీరోని చేసింది. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఆ జవాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. తోటి భారతీయుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవడం నా బాధ్యతగా భావించాను.. అందుకే, రక్తం ఇచ్చాను అని తెలిపారు రాజ్‌కమల్.
Constable Rajkamal of 133 Bn CRPF based in Jharkhand donated blood to Save life of a dreaded Naxal who was after the lives of his own Brother Jawans. pic.twitter.com/1KXqU2Aq1u
— Poonam Pandey (@pandeypoonam20) February 5, 2019