సెహ్వాగ్ రికార్డ్ సమం చేసిన బట్లర్…

228
- Advertisement -

ఐపీఎల్-11వ సీజన్‎లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ పరుగుల వరద కురిపిస్తున్నాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న రాజస్థాన్‎ని ఒంట్టిచేత్తో ప్లే ఆఫ్ దిశగా తీసుకెళ్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో ఫోర్లు, సిక్సులతో పరుగుల వర్షం కురిపించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‎లో బట్లర్ పరుగుల సునామితో చెలరోగడంతో ముంబై ఓటమి చవిచూసింది.

Sehwag's record equals Buttler with 5th straight IPL fifty

ఈ మ్యాచ్ లో బట్లర్ 53 బంతుల్లో 94 రన్స్ చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‎లో ఐదు ఆఫ్‌ సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్‎గా సెహ్వాగ్ పేరుమీదున్న రికార్డును బట్లర్ సమం చేశాడు. 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన సెహ్వాగ్ వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‎గా రికార్డును సృష్టించాడు.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ భారాన్ని మొత్తం మోస్తున్న బట్లర్… ఢిల్లీపై జరిగిన మ్యాచ్‎లో 67, పంజాబ్‎పై 51, 82, చెన్నైపై 95, ముంబైపై 94 పరుగులు చేశాడు. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచులలో 6 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ ప్లే ఆఫ్‎కి చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‎లు కూడా ఖచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం ఈ జట్లు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. అయితే నిన్నటి మ్యాచ్‎లో ఓడిన ముంబై ప్లే ఆఫ్ ఆశలు కోల్పోయింది.

- Advertisement -