ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. గ్రౌండ్‌లో బ్యాటుతో పరుగుల వరద పారించేవాడు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తన ట్వీటుతో నవ్వుల వరద పారిస్తున్నాడు వీరు. వ్యక్తులెవరైనా.. సంధర్బం ఏదైనా.. తన పంచులతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు సెహ్వాగ్. తాజాగా సెహ్వాగ్ తన భార్యపై మరోసారి హాస్య గుళిక వేశాడు. వీరూ మంగళవారం తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లాడు. ఓ వైపు సినిమా నడుస్తున్నా మనసంతా ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్ మీదే ఉంది. అందుకే ఓ ప్లాన్ వేసి వైఫ్‌ని మెప్పించాడు.
వీరూ సతీమణి సినిమా చూస్తుండగా తాను మాత్రం మొబైల్ తీశాడు. హాట్‌స్టార్‌లో ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మ్యాచ్ వీక్షించాడు. దీంతో ఇద్దరూ హ్యాపీ.. హ్యాపీ.. ఈ సందర్భంగా తాను థియేటర్‌లో మ్యాచ్ చూస్తున్న ఫొటోను ట్విటర్‌లో అభిమానులతో పంచుకొని చక్కని పంచ్ వేశాడు వీరూ. ‘భార్య సంతోషంగా ఉందంటే జీవితం ఆనందంగా ఉన్నట్టు. థియేటర్‌లో భార్య సినిమా చూస్తుండగా మ్యాచ్ చూస్తున్నా. నేను కుషీ, ఆమె కుషీ. చిన్నచిన్న ఆనందాలు!’ అని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు.
ఐపీఎల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో కేవలం విదేశీ ఆటగాళ్ల బాధ్యారాహిత్యం వల్లే ప్లేఆఫ్ చేరలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్ ఆటతీరు తీవ్రంగా నిరాశపరిచిందన్న వీరూ.. విదేశీ ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యత తీసుకోలేదన్నాడు. ప్రధాన ఆటగాళ్లలో ఏఒక్కరు సరిగ్గా ఆడలేదు. నలుగురు కీలక ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 12-15 ఓవర్లు వరకు క్రీజులో నిలబడాలి. కానీ ఎవరూ ఆబాధ్యత తీసుకోలేదన్నాడు.