సెగ్గడ్డ దెబ్బకు ఇమేజ్ డ్యామేజ్ !

54
- Advertisement -

మంచు కుటుంబం పై ట్రోలింగ్ కి అసలు కారణం.. మంచు ఫ్యామిలీ మెంబర్స్ స్వయంక్రుతాలే. ఇటివలే మంచు విష్ణు దాడి చేస్తున్నాడంటూ మంచు మనోజ్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచు బ్రదర్స్ మధ్య గొడవ అంటూ ఆ వీడియో వైరల్ గా మారింది. అసలు మనోజ్, విష్ణు ల మధ్య ఏం జరిగింది ? గొడవలు ఏ విషయంలో ?, దీనికితోడు దీన్ని కవర్ చేసుకోవడానికి మంచు విష్ణు రిలీజ్ చేసిన ‘హౌస్ అఫ్ మంచుస్’ ఫేకా ? రియలా ? ఇలా మంచు ఫ్యామిలీకి సంబంధించి చాలా విషయాలే ఉన్నాయి. ఐతే, తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంచు మనోజ్‌ను ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘భుజంపై సెగ్గడ్డ లేచింది.. వచ్చి గోకుతారా?’ అంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

ఎంత దురుసుతనం ?, ఇన్నాళ్లు మనోజ్ మంచోడు మంచోడు అని పొగిడిన మీడియా పైనే ఇలా కఠినంగా మాట్లాడటం దారుణం. మొత్తానికి మనోజ్ చేసిన వ్యాఖ్యలు, మంచు ఫ్యామిలీకి మరింత అప్రతిష్ట తెచ్చేలా వున్నాయి. ఇంట్లో జరిగిన గొడవ గురించి అడిగితే.. మంచు మనోజ్ చాలా విచిత్రమైన సమాధానం ఇచాడు. ‘’ సెగ్గడ్డ లేచింది.. వచ్చి గోకుతారా?’ అని రివర్స్ లో ఎవరికీ అర్థం కానీ ఓ మాట అనేసి వెళ్ళిపోవడం గొప్పా ?, గొడవ గురించి మాట్లాడటం ఇష్టం లేకపోతే.. తెలీదని చెప్పాలి, అన్నదమ్ముల మధ్య ఏదో చిన్న మాట పట్టింపు అనాలి. అంతేగాని మనోజ్ ఇలా మాట్లాడటం ఏమిటి ?.

అసలు మంచు విష్ణు చెబుతున్నట్లు అంతా రియాలిటీ షో అనేస్తే.. ఏ గొడవ ఉండేది కాదు. కానీ మనోజ్ అలా మాట్లాడలేదు. అనవసరంగా మీడియా పై నోరు పారేసుకున్నాడు. మీడియా ముందు సహనం కోల్పోయినట్లు ఈ మొరటు వ్యాఖ్య ఏమిటో అర్థం కావడం లేదు. మంచు మనోజ్ వున్నది వున్నట్లు మాట్లడే మనిషి అనే పేరుంది. గొడవ గురించి అడిగినప్పుడు అసలు విషయం ఏమిటో చెప్పాలి. లేదా సందర్భం కాదు అనేయాలి. అంతేగానీ హుందాగా వ్యవహరించాల్సిన చోట ఇలా అసందర్భంగా మాట్లాడటం అంటే తనకు ఉన్న విలువును తానే పలుచన చేసుకున్నట్లు. ఏది ఏమైనా ఈ మాటలతో మనోజ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. మనోజ్ ఇకనైనా కాస్త ఆలోచించి మాట్లాడు.

ఇవి కూడా చదవండి…

హీరోయిన్ మోసంపై కోర్టు సీరియస్

వావ్.. పైత్యపు హీరోగారి నీతులు

SPY:నిఖిల్‌..అమెజాన్, స్టార్‌ నెట్‌వర్క్‌ థియేట్రికల్‌ రైట్స్‌..!

- Advertisement -