- Advertisement -
ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు మంత్రి సీతక్క.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది అని తెలిపారు. జల్ జంగల్ జమీన్ పై కొమురం భీం చేసిన పోరాట ఫలితంగానే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తొలి ప్రధాని నెహ్రూ ఆదివాసి గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించారు అన్నారు.
ఆదివాసీల అభివృద్ధితోనే కొమురం భీం ఆశయాలు నెరవేరతాయి… ఆదివాసీల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోంది అని వెల్లడించారు.
Also Read:TGSRTC:గ్రీన్ ఫీజు పేరుతో జేబుకు చిల్లు
- Advertisement -

