మహిళా సాధికారతకు పెద్దపీట:సీతక్క

8
- Advertisement -

అసెంబ్లీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమగ్రంగా సమాధానం ఇచ్చారు. మహిళా సాధికారత, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఇది మహిళల రోజువారీ ఖర్చులను తగ్గించి, ఉపాధి, విద్య, ఆరోగ్య అవసరాలకు మరింత సులభంగా చేరువ కావడానికి ఉపయోగపడుతోందని తెలిపారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి సీతక్క వివరించారు. ఈ కార్యక్రమం కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం సహాయక సంఘాల (ఎస్‌జీహెచ్) బలోపేతం చేయడం, చిన్న పరిశ్రమలు, క్యాంటీన్లు వంటి ఉపక్రమాల ద్వారా స్థిర ఆదాయం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలకు ఉపాధి లభించడమే కాకుండా, ప్రజలకు కూడా నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు.

ప్రతి మహిళ స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా మారాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంక్షేమానికి అవసరమైన అన్ని విధాలా మద్దతు, నిధులు, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

Also Read:చంద్ర గ్రహణం..శ్రీవారి ఆలయం మూత

- Advertisement -