TTD:వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

7
- Advertisement -

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు.

సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని రంగ మండ‌పంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంత‌రం విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ఆరాధ‌న, నిర్వ‌హించారు. ప్ర‌త్యేకంగా సీత‌మ్మ‌వారికి “వాసంతిక పూజ” మ‌ల్లె పూల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

Also Read:‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్

- Advertisement -