ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ అనే పదాన్ని బాగా వాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సినిమా ఇండస్ట్రీలో కొత్త భామలకు ఇప్పుడు అవకాశాలు రావాలంటే ఏ డైరెక్టర్ చుట్టూనో..నిర్మాత చుట్టూనో తిరగాల్సిన పనిలేదు. జస్ట్ అలా సోషల్ మీడియాలో తిరిగేస్తే చాలు. ఆఫర్లు అవే వచ్చిపడతాయి. ఇది కూడా ఒక రకంగా ఆడిషన్
లాంటిదే. ఈ ట్రెండ్ ని టాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ క్యాచ్ చేసింది.
అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది సీరత్. అసలు విషయానికొస్తే…ఈ బ్యూటీ టాలీవుడ్లో చేసిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గవే. కానీ ఆఫర్లు ఈ అమ్మడుకి ఆమడదూరంలో ఉన్నాయి.
టాలీవుడ్లో ‘రన్ రాజా రన్’ మూవీతో సక్సెస్ గేర్‌లో తన కెరీర్‌ని స్టార్ట్ చేసిన సీరత్‌కు… ఆ తర్వాత వచ్చిన టైగర్, కొలంబస్ , లాంటి మూవీలు గట్టి దెబ్బే కొట్టాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడుకి ఏడాదిన్నరకు పైగా ఆఫర్లు రాలేదు.
ఇలాంటి టైంలోనే సోషల్ మీడియాలో బికినీలో తన ఫోటోలను తెగ షేర్ చేసేస్తూ.. జనాల అటెన్షన్ ను బాగానే రాబట్టింది. దాంతో నిర్మాతల కన్ను ఈ అమ్మడుపై పడింది. ఆ రిజల్టే..సీరత్ కు నాగార్జునతో కలిసి రాజు గారి గది2 చిత్రంలో నటించే అవకాశం. అదే ఊపులో అల్లు శిరీష్ తో కలిసి ‘ఒక్క క్షణం’ మూవీలో కూడా కనిపించింది. ‘టచ్ చేసి చూడు’ కూడా ఈ స్పీడ్ లో వచ్చిన అవకాశమే.
అయితే ఆ సినిమాలన్ని డిజప్పాయింట్ అవడంతో అమ్మడి లెక్కలు కాస్తా తారుమారయ్యాయి. దాంతో మళ్ళీ సోషల్ మీడియా బాటపట్టింది సీరత్ కపూర్. మళ్ళీ తన సొగసులను చూపిస్తూ.. ఆఫర్లకోసం వల వేస్తోంది. మరీ న్యూడ్‌గా కాకుండా కాస్త ఘాటుగానే కనిపిస్తోంది. మరీ బికినీ వరకూ రాలేదుగానీ.. అమ్మడి స్పీడ్ చూస్తుంటే మాత్రం అక్కడి వరకూ రావడానికి పెద్దగా టైం పట్టేలా లేదు. మరి మళ్ళీ సోషల్ మీడియాలో హీట్ పుట్టించడానికి రెడీ అయిన సీరత్పై ఏ నిర్మాత కన్ను పడుతుందో చూడాలి.