నరికి పొగులుపెడతా..వీడియో జర్నలిస్ట్ పై బాలయ్య అరాచకం

235
balakrishna Slaps Cameraman
- Advertisement -

సీనీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తలోకెక్కారు. ప్రస్తుతం ఆయన హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన వీడియో జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారు. అంతేకాకుండా అతడ్ని బండ బూతులు తిట్టాడు. ఆ టీవీ విలేకరి తీసిన వీడియో క్లిప్పును డిలీట్ చేయాలని బాలయ్య అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణకు ఎదురుగా చిన్నపిల్లలు వస్తుండటంతో ఆయన సెక్యూరిటీ ఆపిల్లలను పక్కకు నెట్టేశారు.

దీంతో ఆ వీడియో తీసిన జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారు బాలయ్య.. ఆ వీడియో డిలిట్ చేయమంటూ అతన్ని బండ బూతులు తిట్టాడు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య అతడిని బెదిరించారు. జనాలు ఎక్కువగా రావడంతో వెంటనే బాలయ్య అక్కడి నుంచి పరారయ్యారు. బాలకృష్ణ మీడియా ప్రతినిధిపై చెయ్యిచేసుకోవడంతో జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాలకృష్ణపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -