మెగా వారసురాలిని చూశారా..?

46
- Advertisement -

మెగా కుటుంబంలోకి వారసురాలు వచ్చిన విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. పెళ్లి అయిన దాదాపు 11 సంవత్సరాల తర్వాత తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన నిన్న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీతో పాటు, వారి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మా మెగా కుటుంబంలోకి మెగా వారసురాలు వచ్చేసిందని సంబరాలు చేసుకుంటున్నారు. పైగా మంగళవారం ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని మెగాస్టార్ కూడా అన్నారు.

అయితే, ఇంతకీ మెగా ప్రిన్సెస్ కి ఎవరి పోలికలు వచ్చాయి ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం మెగా పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాప ఫోటోను చూసిన అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్ పోలికలతో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ కి చిరు పోలికలు రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నట్లు నిజంగానే పాప చిరు, రామ్ పోలికలతో ఉంది.

Also Read: మెగా ప్రిన్సెస్‌ కు తాతల సెంటిమెంట్

చరణ్‌ – ఉపాసనల కుమార్తెతో కలిపి చిరంజీవి దంపతులకు 5వ మనవరాలు ఉన్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో పాటు చిన్న కుమార్తె శ్రీజకు ఇద్దరేసి కుమార్తెలున్నారు.

Also Read: ప్చ్.. దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

- Advertisement -