సృష్టిలోనే మధురమైనది.. మాతృత్వం… వివాహమైన ప్రతి మహిళ మాతృత్వం పొందాలని… పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. మహిళ గర్భం దాల్చిందనే వార్త తెలియగానే అటు పుట్టింట్లో… ఇటు మెట్టింట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అమ్మ.. భాషకు అందని భావం.. తల్లిని మించిన దైవం ఈ ప్రపంచంలోనే లేదు.. కనిపించే దైవం అమ్మ.. కరుణించే రూపం అమ్మ.. కమ్మనైన అమ్మతనం గురించి కనురెప్పల కాపాడే అమృతమూర్తి గురించి ఎంత చెప్పినా మరో ఆకాశమంత పేజీ మిగిలే ఉంటుంది. ఎవరెంత ప్రేమ చూపించినా… ఎవరెంత బాధ్యత వహించినా అమ్మలోని అనురాగం రుచి చూడనిదే జీవితం పసందుగా ఉండదు.
టెన్నిస్ట్ స్టార్ సానియా మీర్జా.. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ హాస్పటల్‌లో ఆమె పురుడు పోసుకుంది. అయితే తన కుమారుడు ఇజాన్‌ను ఎత్తుకుని హాస్పటల్ నుంచి బయటకు వస్తున్న సానియా మీర్జా ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫ్యాన్స్ క్లబ్ ఆ ఫోటోను షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ చకర్డ్ డ్రెస్సులో హాస్పటల్ నుంచి బయటకు వస్తున్న సానియా.. తన చేతుల్లో కుమారున్ని ఎత్తుకుని ఉంది. మాతృత్వపు మధురానుభూతుల్ని అస్వాదిస్తున్నట్లు ఈ ఫోటోలో సానియా మీర్జా కనిపిస్తోంది. 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్‌ను సానియా మీర్జా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.