చోర్ మోడీ..సినీ నటిపై కేసు

334
ramya modi
- Advertisement -

సినీ నటి,కాంగ్రెస్ పార్టీ నేత,మాజీ ఎంపీ రమ్యపై కేసు నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ చోర్ మోడీ అంటూ కామెంట్ చేస్తూ ఆమె చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ ఫిర్యాదు మేరకు గౌమతి నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ద్వేషం చిమ్ముతూ…ఆయన ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 124ఏ, ఐటీ సవరణ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం కేసు పెట్టారు పోలీసులు.

తన నుదుటిపై తానే చోర్ (దొంగ) అని ప్రధాన మోడీ రాస్తున్నట్టుగా ఉన్న ఫొటోను మార్ఫ్ చేసి ట్విట్టర్ లో రమ్య పోస్ట్ చేసిందని.. ఇది దేశ ప్రధానికి.. దేశానికి జరిగిన ఘోరమైన అవమానమని సయ్యద్ రిజ్వాన్ అన్నారు.

ప్రధానిని దొంగ అని ఇటీవల విమర్శించారు రాహుల్ గాంధీ. రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించి జరిగిన స్కాంపై రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయగా రమ్య మోడీ ఫోటోను షేర్ చేసి చిక్కుల్లో పడింది.

- Advertisement -